schedule Saturday, July 04, 2026

కార్మికుడిని కబళించిన మృత్యువు

calendar_today August 14, 2025
person dharshininews
కార్మికుడిని కబళించిన మృత్యువు
కార్మికుడిని కబళించిన మృత్యువు - బైకు, సిమెంట్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి - కేసు నమోదు చేసిన కరణ్ కోట్ పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ కార్మికుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. బైకు, సిమెంట్ ట్యాంకర్ ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. kvcs ఎస్ఐ రాథోడ్ వినోద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన షేక్ పాష(60) బెల్కటూర్ సమీపంలో ఉన్న సీసీఐ రైల్వే ట్రాక్ వద్ద కార్మికుడుగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని గురువారం ఉదయం తన బైకుపై గ్రామానికి వెళుతున్నాడు. మార్గ మద్యలోని గోపన్ పల్లి సమీపంలో ఓ గుర్తుతెలియని సిమెంట్ ట్యాంకర్ బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైకుపై ఉన్న షేక్ పాషకు తీవ్రగాయాలై . కిందపడిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు పాషను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరిశీలింగా అప్పటికే షేక్ పాష మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి ముగ్గురు కుమారులు ఉన్నట్లు తెలిసింది. మృతుని కుమారుడి ఫఙర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐఐ రాథోడ్ వినోద్ తెలిపారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన పాషను కోల్పోవడంతో కుటుంభీకులు బోరున విలపించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37742/