schedule Saturday, July 04, 2026

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

calendar_today August 13, 2025
person dharshininews
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య - తాండూరు రైల్వే స్టేషన్లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. kvcs రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం తెల్లవారు జాము సుమారు 3-30గంటల ప్రాంతంలో బీజాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతోంది. తాండూరు రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం చివరి భాగం వద్ద సుమారు 40ఏండ్లు పైబడిన ఓ వ్యక్తి పట్టాలపై బోర్లా పడుకున్నాడు. రైలు పైనుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుని ఆత్మహత్యకు గల కారణాలు కూడా తెలియరాలేదు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. మృతుని వివరాలను తెలిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37695/