schedule Monday, September 07, 2026

మత్తు పదార్థాల జోలికి పోవద్దు..!

calendar_today August 13, 2025
person dharshininews
మత్తు పదార్థాల జోలికి పోవద్దు..!
మత్తు పదార్థాల జోలికి పోవద్దు..! - పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి - మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి పోవద్దని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్ధాల నియంత్రణపై అవగాహన కల్పించారు. kvcs ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ సమక్షంలో విద్యార్థులుతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మహమ్మారి చెడు వసనాలకు ఆకర్షితులైతే జీవితాలు నాశనమవుతాయని వివరించారు. వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ శానిటరి ఇను స్పెక్టర్ వెంకటయ్య, ఎన్వీరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37692/