schedule Monday, September 07, 2026

తల్లడిల్లి.. ప్రాణాలొదిలే..!

calendar_today August 11, 2025
person dharshininews
తల్లడిల్లి.. ప్రాణాలొదిలే..!
తల్లడిల్లి.. ప్రాణాలొదిలే..! - ఇళ్లు పైకప్పు కూలి ఎద్దు మృతి - బషీరాబాద్ క్యాద్గిరాలో ఘటన బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : భారీ వర్షానికి ఇళ్లు కూలడంతో ఇంటి పైకప్పు పడి ఓ కాడెద్దు మృతి చెందింది. అయ్యో పాపం బసవణ్ణ అంటూ పలువురు విచారం వ్యక్తం చేశారు. kvcs ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం క్యాద్గిరా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హైమద్ అనే రైతు వద్ద కాడెద్దు ఉంది. దానిని ఇంట్లోనే కట్టేసి ఉంచాడు. సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి ఇంటి పైకప్పు తంపుకు గురై కూలిపోయింది. కూలిన పైకప్పు ఒక్కసారిగా ఎద్దుపై పడడంతో ఊపిరి ఆడక.. శిథిలాల కింద నలిగిపోయింది. కొద్ది సేపటికే ఎద్దు ప్రాణాలను విడిచింది. ఈ విషాధ ఘటనపై రైతు యజమాని హైమద్ విచారం వ్యక్తం చేశారు. ఎద్దు మృతితో నష్టం జరిగిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నాడు. ఈ సంఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37626/