తాండూరు బీజేపీలో విషాధం
August 6, 2025
dharshininews
తాండూరు బీజేపీలో విషాధం
- అనారోగ్యంతో మండల అధ్యక్షుడి కన్నుమూత
- విచారం వ్యక్తం చేసిన నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని బీజేపీ పార్టీలో విషాధం నెలకొంది. తాండూరు మండల అధ్యక్షులుగా కొనసాగుతున్న ప్రభు శంకర్ కన్నుమూశారు. ఈ సంఘటన బుధవారం జరిగింది.
తాండూరు మండలానికి చెందిన ప్రభు శంకర్ బీజేపీ మండల అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించాలని భగవంతున్ని ప్రార్ధించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/37466/