ఆర్టీసీ బస్సును ఆపేసిన లేడీ..!
July 17, 2025
dharshininews
ఆర్టీసీ బస్సును ఆపేసిన లేడీ..!
- కిటికీలో నుంచి వేసిన పర్సు, సెల్ ఫోన్ మాయం
- తోటి ప్రయాణికులు దొంగలించారని రభస
- పోలీసు సిబ్బంది ఏం చెప్పారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : బస్సులో సీటు కోసం కిటికి ద్వారా బయటి నుంచి ఓ మహిళ తన పర్సు, సెల్ ఫోన్ లోపలికి వేసింది. ఆమె లోపలికి ఎక్కేలోపు పర్సు, ఫోన్ మాయం కావడంతో నానా రభస చేసి నడిరోడ్డుపై బస్సును ఆపేసింది. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది.
బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ మండలం రెడ్డిగణాపూర్ గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ మధ్యాహ్నం తాండూరు బస్టాండుకు వచ్చింది. చించొల్లి వైపు వెళ్లేందుకు, ఓగీపూరు ఆర్టీసీ బస్సు వద్దకు చేరుకుంది. బస్సులో ప్రయాణికులు ఉండగానే ఓ కిటికీ పక్కన సీటు రిజర్వు చేసుకునేందుకు తన చేతిలో ఉన్న పర్సుతో పాటు సెల్ ఫోన్ను బయటి నుంచి సీటుపై వేసింది. ఆమె ఎక్కేలోపే అవి రెండు కనిపించలేదు. దీంతో బస్సులో ఉన్న వారే దొంగిలించి ఉంటారని నానా రభస చేసింది.
పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్దకు రాగానే బస్సు నుంచి కిందకి దిగి బస్సు ముందుకు వెళ్లకుండా అడ్డంగా వెళ్లింది. దీంతో బస్సు రోడ్డు మద్యనే ఆగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీస్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మహిళతో మాట్లాడారు. సెల్ ఫోన్ తో పాటు పర్సులో డబ్బులు దొంగిలించారని ఆవేధన వ్యక్తం చేసింది. పోలీస్ కానిస్టేబుల్ ప్రయాణికులను ప్రశ్నించగా బస్సులో ఉన్న వారు కూడా తమకేమి తెలియదని చెప్పడంతో ఏమి చేయలేకపోయారు. సెల్ ఫోన్, డబ్బులు పోయాయని స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మహిళ ఏమి చేయలేక ఊసూరుమంది. స్థానికులు అయ్యో పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/36931/