schedule Saturday, July 04, 2026

సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్

calendar_today July 9, 2025
person dharshininews
సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్
సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ - పెట్టిన యువకుడిపై వర్గం దాడి - తాండూరు మండలం అంతారంలో ఘటన - మరో యువకుడిపై కూడా దాడి..?! - ఖండించిన బీజేపీ, హిందూ వాహిని నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సోషల్ మీడియాలో యువకుడు పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. పోస్టు పెట్టిన యువకుడిపై కొందరు దాడికి పాల్పడినట్లు బాధిత వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన బుధవారం తాండూరు మండలం అంతారం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన వడ్డె రవి అనే యువకుడు మంగళవారం రాత్రి తన మోబైల్ నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఇది గమనించిన కొందరు తమ వర్గాన్ని అవమాన పరిచే విధంగా ఉందని ఆందోళనకు దిగారు. పోస్టు పెట్టిన రవిపై దాడికి పాల్పడ్డారు. అదే రాత్రి యువకుడిని గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు తీసుకవచ్చి క్షమాపణలు చెప్పే విధంగా ఒత్తిడి తీసుకవచ్చారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, హిందూ వాహినీ నాయకులు యువకుడిపై జరిగిన దాడిని ఖండించారు. బాధిత యువకుడి ద్వారా తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు స్వీకరించడం జరిగిందని, దర్యాప్తు చేపడుతున్న పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. మరోవైపు వడ్డె రవితో పాటు మరో యువకుడిపై కూడా దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36768/