schedule Friday, September 04, 2026

రూ.లక్షకు.. 2లక్షలు..!

calendar_today June 20, 2025
person dharshininews
రూ.లక్షకు.. 2లక్షలు..!
రూ.లక్షకు.. 2లక్షలు..! - పెట్టుబడికి రెండింతల ఆధాయం - కేంద్ర ప్రభుత్వ స్కీంకు డిమాండ్ - వెయ్యి నుంచి పెట్టుబడికి అవకాశం - నిబంధనలు, అర్హతలు ఇవే.. దర్శిని డెస్క్ : రూ.లక్ష పెట్టుబడికి రూ. 2లక్షలు పొందే అవకాశం. ఇదేం స్కామ్ కాదు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్కీం. రూ. 1వెయ్యి నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టి స్కీంలో చేరొచ్చు. ఇంతకీ ఈపథకం ఏమిటి..? నిబంధనలు.. అర్హతలు ఏవి..? ఆధాయం ఎలా పొందవచ్చో.. ఇక్కడ తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా అమలు చేస్తున్న ఓ స్కీం పేరే కిసాన్ వికాస్ పత్ర. 1988లో చిన్న పొదుపు సర్టిఫికెట్ చొరవగా ప్రవేశపెట్టబడిన కిషన్ వికాస్ పాత్ర పథకం. దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణను పొందేలా ప్రజలను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ఖాతాను ఫోస్టాఫీసులో తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతాలో జమచేసే డబ్బుకు ప్రభుత్వమే గ్యారెంటీగా వ్యవహరిస్తోంది. ఈ పథకంలో రూ. 1వెయ్యి నుంచి ఎంతైనా డబ్బులు పెట్టుబడి పెట్టుకోవచ్చు. రూ. 1వెయ్యి పెడితే.. 2వేలు, రూ. 10వేలకు.. 20వేలు, రూ. లక్షకు 2లక్షలు, రూ. 10లక్షలకు 20లక్షలు రిటర్న్‌ వస్తాయి. వన్‌ టైమ్‌ ఇన్వెస్‌మెంట్‌తో నడిచే ఈ పథకం 115నెలల వరకు గడువు ఉంటుంది. ఆ తరువాతే పెట్టిన పెట్టుబడికి రెండింతల ఆధాయం వస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ 7.5శాతంగా ఉంది. నిబంధనలు.. అర్హతలు.. 10 సంవత్సరాల వయసు దాటిన పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులే. ఫోస్టాఫిసు వద్దకు వెళ్లి ఖాతాకు సంబంధించిన వెళ్లి ఫారమ్‌ను నింపాలి. దీని తర్వాత దరఖాస్తు డబ్బును డిపాజిట్ చేయండి. దీని తర్వాత, ఖాతా తెరిచిన వెంటనే, మీరు కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్ పొందుతారు. కిసాన్ వికాస్ పత్ర పథకంలో వ్యక్తిగత, జాయింట్ ఖాతాలు తెరుచుకునేందుకు వీలుంది. ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలు అయినా తెరవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు మరణించిన సందర్భంలో, డిపాజిట్ నామినీకి లేదా నామినేట్ చేయబడి ఉన్న న్యాయపరమైన వారసులకు చెల్లించబడుతుంది. వారసులు ఉంటే, వారు దానిని కొనసాగించడాన్ని ఎంచుకోవచ్చు లేదా పరిపక్వత తర్వాత వడ్డీతో డిపాజిట్‌ను పొందవచ్చు. అకౌంట్ కొనసాగించకపోతే, అది నిల్వ చేయబడుతుంది మరియు డిపాజిట్, వడ్డీతో సహా తిరిగి చెల్లించబడుతుంది. ఇదికూడ చదవండి... https://www.dharshininews.com/36253/