schedule Friday, September 04, 2026

రక్తదాతలు.. ప్రాణదాతలు..!

calendar_today June 14, 2025
person dharshininews
రక్తదాతలు.. ప్రాణదాతలు..!
రక్తదాతలు.. ప్రాణదాతలు..! - రక్తదానంపై అవగాహన పెంచుకోవాలి - జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. వినయ్ కుమార్ - జిల్లా ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : రక్తదాతలు ప్రాణదాతలే అని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. వినయ్ కుమార్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకున్నారు. సూపరిండెంట్ డా. వినయ్ కుమార్ సమక్షంలో సిబ్బంది కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సూపరిండెంట్ డా. వినయ్ కుమార్ మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణాలను నిలబెట్టే ప్రాణదాతలని అన్నారు. కృతిమంగా ఏదైనా సృష్టించగలం కాని రక్తదాన్ని ఎవ్వరు తయారు చేయలేరు. కావున యువత. ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేయడంలో అవగాహన పెంచుకోవాలన్నారు. ఇప్పటి వరకు రక్తదానం చేసిన వారంతా ఆదర్శనీయులే అని అన్నారు. అదేవిధంగా రక్తనిధి కేంద్రంలో సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్ రెడ్డి, రక్తనిధి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36167/