schedule Friday, September 04, 2026

ఏఎస్ జీఎంకే సేవా తపన అభినందనీయం

calendar_today May 11, 2025
person dharshininews
ఏఎస్ జీఎంకే సేవా తపన అభినందనీయం
ఏఎస్ జీఎంకే సేవా తపన అభినందనీయం - తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి - తాండూరులో చారిట్రబుల్ ట్రస్ట్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో పేదలందరి అభివృద్ధికి చేయూత అందించాలని ఏఎస్ జీఎంకే చారిట్రబుల్ ట్రస్ట్ సేవా తపన అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరుకు చెందిన ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఫౌండర్ గా చైర్మన్ గా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ జీఎంకే చారిట్రబుల్ ట్రస్టును చీఫ్ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య సేవలు, ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాలను మహేందర్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలని ముజీబ్ ఖాన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ట్రస్టు ద్వారా వైద్య శిబిరాలు, కంప్యూటర్ శిక్షణతో పాటు పేదలందరి అభ్యున్నతికి తోడ్పాటు అందిచేలా సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీపీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తంరావు, నాయకులు డా. సంపత్ కుమార్, ట్రస్టు సభ్యులు, మైనార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35511/