schedule Saturday, July 04, 2026

పోయిన ఫోన్లపై పోలీసుల గురి..!

calendar_today April 15, 2025
person dharshininews
పోయిన ఫోన్లపై పోలీసుల గురి..!
పోయిన ఫోన్లపై పోలీసుల గురి..! - రికవరీలో తాండూరు పోలీసుల వృద్ధి - ఈ యేడాదిలో 24 మోబైళ్ల గుర్తింపు - తాజాగా 13 సెల్ ఫోన్ల అప్పగింత - అభినందించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏదైనా స్మార్ట్ ఫోన్ ఫోగొట్టుకున్నా.. ఎవరైనా దొంగిలించినా అది దొరుకుతున్న నమ్మకం పోయిన రోజులు ఇవి. తాండూరు పోలీసులు పోయిన ఫోన్లపై గురి పెట్టి రికవరీ చేస్తూ భళా అనిపించుకుంటున్నారు. మోబైల్ ఫోన్లరికవరీలో రోజు రోజుకు వృద్ధి సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సీఈఐఆర్ టెక్నాలజీతో పోయిన ఫోన్లను ట్రాక్ చేస్తూ పట్టేస్తున్నారు. తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో గత యేడాది 238 మోబైల్ ఫోన్లు పోయినట్లు బాధితులు ఫిర్యాదు అందించగా అందులో 113 ఫోన్లను గుర్తించారు. ఈ యేడాది మొత్తం 40 ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు రాగా 24 ఫోన్లను గుర్తించారు. తాజాగా మంగళవారం సీఈఐఆర్ ద్వారా గుర్తించి 13 ఫోన్లను రికవరీ చేశారు. తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా పట్టణ సీఐ సంతోష్ కుమార్ సమక్షంలో బాధితులకు అందజేశారు. ఫోన్ల రికవరీలో పనితీరును ప్రదర్శించిన కానిస్టేబుల్ షబీల్ ను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అభినందించారు. ఈసందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు రికవరీలో తాండూరు పోలీసుల పనితీరును అభినందించారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. సాంకేతిక వ్యవస్థ సీఈఐఆర్ ద్వారా గుర్తించి అప్పగించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34852/