schedule Tuesday, September 08, 2026

బీజేపీ నేత బైకు చోరీ..!

calendar_today April 5, 2025
person dharshininews
బీజేపీ నేత బైకు చోరీ..!
బీజేపీ నేత బైకు చోరీ..! - పార్కు చేసిన చోటే మాయం - తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ పార్టీకి చెందిన నేత బైకును గుర్తుతెలియని వ్యక్తులు అహరించుకుపోయారు. పార్కు చేసిన బైకు మాయమైన సంఘటన తాండూరు పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సీసీఐ కాలనీకి చెందిన బంటారం భద్రేశ్వర్ బీజేపీ పార్టీలో జిల్లా నాయకులుగా కొనసాగుతున్నారు. గతనెల 29వ తేదిన ఉదయం తాండూరు డీఎస్పీ కార్యాలయం ముందు తన బైకు (సెండర్ ప్లస్) పార్కు చేసి స్థానిక రైల్వే స్టేషన్ నుంచి రైళ్లో హైదరాబాద్ వెళ్లారు. అదేరోజు సాయంత్రం తిరిగి వచ్చి చూసే సరికి పార్కు చేసిన బైకు కనిపించలేదు. దీంతో తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు బంటారం భద్రేశ్వర్ తెలిపారు. తన బైకును వెతికించి ఇవ్వాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34524/