schedule Saturday, July 04, 2026

కర్ణాటక నుంచి కల్తీ సరుకు..!

calendar_today March 8, 2025
person dharshininews
కర్ణాటక నుంచి కల్తీ సరుకు..!
కర్ణాటక నుంచి కల్తీ సరుకు..! - కాలం లేని ఫ్రూటీ ప్యాకెట్ల దందా - కొరఢా జులిపించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు - ప్యాకెట్లు, రవాణా చేస్తున్న వాహనం సీజ్ - తాండూరు పట్టణ పోలీసులకు అప్పగింత తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక నుంచి రవాణా చేస్తున్న కల్తీ ఐస్ క్రీమ్ ప్యాకెట్ల సరుకుపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా జులిపించారు. నకిలీ కంపెనీ ద్వారా తయారు చేసి.. వినియోగ కాలం తేది లేని ఫ్రూటీ ప్యాకెట్లతో పాటు రవాణాకు వినియోగిస్తున్న వాహనాన్ని, నిందితులను పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన ఓ వ్యాపారి ఎలాంటి కంపెనీ పేరు లేకుండా, కాలం గడవు లేకుండా నైస్ ఫ్రూటీ పేరుతో చిన్నారుల ఐస్ క్రీస్ ప్యాకెట్లను తయారు చేస్తూ వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో తాండూరుకు కూడా ఓ వాహనం(కేఏ32 డీ 5660)ద్వారా పెద్ద ఎత్తున ప్యాకెట్లను రవాణా చేశారు. పక్కా సమాచారం అందుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు తాండూరు పట్టణంలో బస్తాలను దిగుమతి చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో అనుమతి లేని కంపెనీ, కాలం గడువు లేని 67 ఐస్ క్రీమ్ బస్తాలను స్వాదీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్ గా ఉన్న యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. వేసవిలో చిన్నారులను టార్గెట్ చేసుకుని కల్తీ, కాలం చెల్లని ప్యాకెట్లతో దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తాండూరు పట్టణంలో కలకలం రేపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33873/