schedule Saturday, July 04, 2026

పరీక్షా హాల్లోకి వచ్చిన పాము..!

calendar_today March 6, 2025
person dharshininews
పరీక్షా హాల్లోకి వచ్చిన పాము..!
పరీక్షా హాల్లోకి వచ్చిన పాము..! - ఎంటర్‌ అయిన విద్యార్థులకు షాక్ - ఆ తరువాత ఏం జరిగిందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటర్ మీడియట్ సెకండ్‌ ఇయర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంతో ఉత్సహాంగా పరీక్షా హాల్‌లోకి వెళ్లిన విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. పరీక్షా హాల్లోకి వెళ్లగానే పామును చూసి కేకలు వేశారు. ఈ సంఘటన తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో జరిగింది. కాలేజీలోని ఏ బ్లాక్ రూం నెంబర్ 3లో విద్యార్థులు పరీక్షా రాసేందుకు వెళ్లారు. వెళ్లగానే ఓ మూలన పాము కనిపించింది. వెంటనే కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది వచ్చి పామును గమనించారు. కర్రతో పామును కొట్టి చంపేశారు. ఈ సంఘటనతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33788/