schedule Friday, September 04, 2026

వైద్య శిబిరాలతో ఆరోగ్యం..!

calendar_today March 5, 2025
person dharshininews
వైద్య శిబిరాలతో ఆరోగ్యం..!
వైద్య శిబిరాలతో ఆరోగ్యం..! - ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి - ఆర్బీఎల్‌ ఫ్యాక్టరీలో మెగా హెల్త్ క్యాంపు యాలాల, దర్శిని ప్రతినిధి : వైద్య శిబిరాలతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలం ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపులో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 112 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించారు. హెచ్‌ఐవీ, షుగర్‌, బీపీ తదితర అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. వారికీ IEC అవగాహన కల్పించారు. దీంతో పాటు సంపూర్ణ సురక్ష కేంద్రం సేవలపై అవగాహన కల్పించారు. HIV/AIDS, STI/STD నివారణ, HIV ఏవిధంగా వస్తుంది రాదు అనేవిషయాలతో పాటు టోల్ ఫ్రీ 1097 సేవలు గురించి, ART, TB గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిధిగా శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఆరోగ్య వైద్య శిబిరాలతో అందరు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాలల ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. జగదీశ్వరి, డా. శిరీషా, సంపూర్ణ సురక్ష కేంద్రం కౌన్సిలర్ పర్వతాలు, మేనేజర్ కృష్ణవేణి, ఆశవర్కర్స్, ల్యాబ్ టెక్ నిషియన్స్, ఓఆర్‌డబ్ల్యూ. ప్రకాష్, అనంతప్ప, ఆర్బీఓఎల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33785/