schedule Saturday, July 04, 2026

వీడిన ఆత్మహత్యల మర్మం..!

calendar_today February 28, 2025
person dharshininews
వీడిన ఆత్మహత్యల మర్మం..!
వీడిన ఆత్మహత్యల మర్మం..! - తల్లీ కొడుకులవి బలవన్మరణాలే - ప్రాథమిక పోస్టుమార్టంలో నిజాలు - వెల్లడించిన తాండూరు రూరల్ సీఐ నగేష్‌ బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలో జరిగిన తల్లీ కొడుకుల ఆత్మహత్యలలో అసలు మర్మం వీడిపోయింది. వారిద్దరివి బలవన్మరణాలే అని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బషీరాబాద్‌ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో గత రెండు రోజుల క్రితం తల్లీ కొడుకులు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో తల్లీ, కొడుకుల ఆత్మహత్యలపై అనుమానాలు రావడంతో కలకలం రేపాయి. గ్రామానికి చెందిన మాల ఎల్లమ్మ(50) గ్రామంలో కూలీ పనులు చేస్తుండగా ఆమె కుమారుడు మాల మొగులప్ప(35) గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య రేణుకా, కుమారుడు, కూతురు ఉన్నారు. వైసల కోసం వేధింపులు అయితే మొగులప్పకు రెండు నెలలకు సంబంధించి రూ. 18వేల వేతనం వచ్చింది. ఈ డబ్బులు తల్లీ, కొడుకులు వాడుకుంటున్నారని భార్య రేణుక వారితో గోడవలకు దిగింది. వారి మద్య వేదింపులు జరిగాయి. ఈ క్రమంలో భార్య రేణుకా బషీరాబాద్‌ పోలీస్టేషన్‌కు వెళ్లి తల్లీ, కొడుకులపై ఫిర్యాదు చేసింది. దీంతో మనస్థాపం చెందిన ఎల్లమ్మ, మొగులప్పలు తమను పోలీస్టేషన్ తీసుకెళ్లి కేసులు నమోదు చేస్తారనే భయంతో మనోవేధనకు గురయ్యాడు. దీంతో రెండు రోజుల క్రితం ఇంట్లో దూళానికి చీరలతో ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మొగులప్ప మృతిపై అనుమానాలు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మొగలప్ప మృతదేహాన్ని తరలిస్తుండగా అతని మర్మాంగాల వద్ద రక్తం కనిపించింది. దీంతో అతని మృతిపై అనుమానాలు రేకేత్తాయి. గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మొగులప్పది ఆత్మహత్య కాదు హత్య చేసి ఉంటారని అనుమానాలకు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. వైద్యుల ప్రాథమిక పోస్టుమార్టంలో అనుమానాలకు తెరపడింది. మొగులప్ప శరీరంపై గాని, మర్మాంగాల వద్ద గాని ఎలాంటి గాయాలు లేవని గుర్తించారు. మొగులప్ప ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో అంతర్లీనంగా ఆయిన సమస్యతో రక్తం బయటకు వచ్చినట్లుగా నిర్ధారణకు వచ్చారు. దీంతో తల్లీ కొడుకులవి ఆత్మహత్యలే అని రూరల్ సీఐ నగేష్‌, బషీరాబాధ్‌ ఎస్ఐ శంకర్‌ లు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33526/