schedule Saturday, July 04, 2026

కలహాలు తీసిన ఉసురు...!

calendar_today February 25, 2025
person dharshininews
కలహాలు తీసిన ఉసురు...!
కలహాలు తీసిన ఉసురు...! - ఉరేసుకుని తల్లీ, కొడుకుల ఆత్మహత్య - బషీరాబాద్‌ మండలంలో దారుణం - పరీశీలిస్తున్న పోలీసులు బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కుటుంబ కలహాలే వారి జీవీతాలకు యమపాశాలు అయ్యాయి. ఇంట్లో గొడవలతో సతమతమైన తల్లీ, కొడుకులు ఉరేసుకుని తనువులు చాలించారు. ఈ హృదయ విదారకర సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు... మండలంలోని కాశింపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లమ్మ(50)కు భర్త లేడు. కుమారుడు మొగులప్ప(35) గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య రేణుకా, కుమారుడు నందకిషోర్, కూతురు వెన్నెల ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఇంట్లో విషయాలపై గొడవ పడ్డారు. ఈ గొడవలు పెద్దగా మారడంతో మొగులప్పపై భార్య రేణుకా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుతో తల్లి ఎల్లమ్మ, కుమారుడు మొగులప్పలు మనోవేధనకు గురయ్యారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో చేరో దూళానికి చీరలతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో తల్లీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడడంతో కలకలం రేపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33429/