'బంగారం' వైన్స్ ఫిర్యాదుపై దర్యాప్తు
February 21, 2025
dharshininews
'బంగారం' వైన్స్ ఫిర్యాదుపై దర్యాప్తు
- అధిక ధరల ఆరోపణలపై విచారణ
- పర్మిట్ రూం నిర్వహణపై కూడా దృష్టి
- నిబంధనలు పాటించకుంటే చర్యలు
- తాండూరు ఎక్సైజ్ సీఐ బాల గంగాదర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం మల్లప్ప మడిగ సమీపంలోని బంగారం వైన్స్ షాపులో అధిక ధరల విక్రయాలపై వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిద్దమవుతున్నట్లు ఎక్సైజ్ సీఐ బాల గంగాదర్ తెలిపారు. ఈనెల 15న మహాన్యూస్ ఛానల్‌కు చెందిన కుమార్ అనే విలేకరి బంగారం వైన్స్ షాపులో బీరు కొనుగోలు చేశారు. దీనికి 190లు ఉండగా ఆన్‌లైన్ పేమెంట్ చేశారు. తరువాత క్యారిబ్యాగ్ ఇవ్వమని కోరగా దానికి యజమాని అదనంగా రూ. 10లు చెల్లించాలని కోరగా.. అధిక ధరలు ఎందుకు చెల్లించాలని అనడంతో ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. దీంతో తాండూరు ఎక్సైజ్ అధికారులకు, పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బంగారం వైన్స్ షాపులో అధిక ధరల విక్రయాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎక్సైజ్ సీఐ బాల గంగాదర్ తెలిపారు. అదేవిధంగా పట్టణంలో అన్ని వైన్స్ షాపులు ఉదయం నుంచి రాత్రి వరకు నిర్ణీత పనివేళలలో మాత్రమే కొనసాగించేలా చూడాలని హెచ్చరించడం జరుగుతుందన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/33331/