schedule Saturday, July 04, 2026

సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం..!

calendar_today February 11, 2025
person dharshininews
సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం..!
సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం..! - 15 నిమిషాల పాటు భారీగా ఎగిసిన మంటలు - షాపు యజమాని నిర్లక్ష్యం వల్ల ప్రమాదం - ప్రమాదానికి పక్కనే ప్రైవేటు స్కూల్ - అప్రమత్తమై పిల్లల్ని తరలించిన యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి: సోఫా రిపేర్లు చేసే దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మంగళవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి మల్ రెడ్డిపల్లి వెళ్లే మార్గంలో మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి సోనియా రెగ్జీన్, సోఫా ఫర్నీచర్ రిపేరు దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం వేళ షాపులో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు షాపు మొత్తం వ్యాపించాయి. దాదాపు 15 నిమిషాల పాటు మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్‌ గౌడ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక సేవలు అందించారు. ప్రమాదం జరిగిన దుకాణానికి పక్కనే ప్రైవేటు స్కూల్ కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే యజమాన్యం అప్రమత్తమై పిల్లలను స్కూలు నుంచి బయటకు తరలించారు. మరోవైపు అగ్ని ప్రమాదానికి యజమాని నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాదంతో యజమానికి సుమారు రూ. 2లక్షల వరకు ఆస్థినష్టం జరిగినట్లు తెలిసింది. స్థానికంగా ఈసంఘటన భయాందోళను కలిగింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33006/