schedule Saturday, July 04, 2026

పాన్ మసాల స్థావరాలపై దాడులు

calendar_today February 9, 2025
person dharshininews
పాన్ మసాల స్థావరాలపై దాడులు
పాన్ మసాల స్థావరాలపై దాడులు - రూ. 35 లక్షల ప్యాకెట్ల పట్టివేత - పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ - చివరకు ఏం జరిగిందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో పాన్ మసాల ప్యాకెట్లు ఉన్న స్థావరాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 35 లక్షల విలువైన ప్యాకెట్లను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ బృందం తాండూరు పట్టణంలోని ధన్ గర్ గల్లిలో దాడులు నిర్వహించారు. రామకృష్ణ అనే వ్యక్తికి చెందిన పావని కిరాణ మర్చంట్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.35లక్షల విలువైన పాన్ మసాల ప్యాకెట్లను స్వాదీనం చేసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఈ సంఘటనపై పట్టణ సీఐ సంతోష్ కుమార్ ను వివరణ కోరగా పాన్ మసాలకు సంబంధించిన జీఎస్టీబిల్లులు లేకపోవడంతో స్వాదీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. యజమానులు బిల్లులు చూపించడంతో వాటిని తిరిగి అప్పగించినట్లు వెల్లడించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32973/