schedule Saturday, July 04, 2026

గంటలోనే ఇంటి గుల్ల..!

calendar_today February 6, 2025
person dharshininews
గంటలోనే ఇంటి గుల్ల..!
గంటలోనే ఇంటి గుల్ల..! - తాళం వేసిన ఇంట్లో చోరీ - బంగారం, వెండి, నగదు అపహరణ - తాండూరు పాతకుంట కాలనీలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి వచ్చిన గంటలోనే ఇంటిని గుల్ల చేశారు. గుర్తుతెలియని దుండగులు. ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణం ఆదర్శనగర్‌ పాతకుంట సమీపంలోని విఘ్నేశ్వర కాలనీలో వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన అశోక్ కుటుంబంతో కలిసి తన ఇంట్లో ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లేందుకు అని ఇంటికి తాళం వేసి వెళ్లారు. తిరిగి గంటలోపే ఇంటికి చేరుకున్నారు. అప్పుడే ఇంటి తాళం విరగి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. ఇంట్లో బీరువా, ఇతర ప్రాంతాలను పరిశీలించగా 2 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 30వేల నగదు పోయిందని గుర్తించారు. ఇంట్లో బంగారం, వెండి, నగదు పోవడంతో ఆవేధనకు గురయ్యారు. మరోవైపు ఇంట్లోకి చోరీ కోసం వచ్చిన వ్యక్తులు వారి తువ్వాలు మరిచిపోయి వెళ్లినట్లు తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితుడు ఆశోక్ మీడియాకు తెలిపారు. గంటలోపే ఇంట్లో చోరి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్ట పగలే చోరీ కావడంతో స్థానికులు జోరుగా చర్చించుకున్నారు. అయ్యే పాపం అంటూ బాధితుల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32893/