schedule Friday, September 04, 2026

అదరగొట్టిన తాండూరు మహిళలు

calendar_today February 2, 2025
person dharshininews
అదరగొట్టిన తాండూరు మహిళలు
అదరగొట్టిన తాండూరు మహిళలు - మాస్టర్ అథ్లెటిక్స్ లో బంగారు, కాంస్య పతకాలు - తీయ పోటీలో మరోసారి మెరిసిన నవనీత, సంతోషి తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో తాండూరు మహిళలు అదరొట్టారు. వేరువేరుగా బంగారు, కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు. గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో తాండూరు పట్టణానికి చెందిన సంతోషి, నవనీతలు ప్రతిభను కనబరిచారు. దీంతో గత నెల 29న త్రిశూర్ లో జరిగిన సీనీయర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2కే25లో పాల్గొన్నారు. 45- 50 ఏళ్ల విభాగంలో సంతోషి ట్రిపుల్ జంప్ లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. లాంగ్ జంపులో నాలుగో స్థానంలో నిలిచారు. అదేవిధంగా 35-40 కేటగిరిలో నవనీత హై జంప్ లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు. నిర్వహకులు విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. తాండూరుకు చెందిన మహిళలు మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో సత్తా చాటడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32755/