schedule Saturday, July 04, 2026

కొమ్మతో రాలిపోయిన జీవితం..!

calendar_today January 30, 2025
person dharshininews
కొమ్మతో రాలిపోయిన జీవితం..!
కొమ్మతో రాలిపోయిన జీవితం..! - చెట్టుపైనుంచి పడి వలస కూలీ మృతి - తాండూరు పోస్టాఫీసు వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : చెట్టు కొమ్మలను నరికేందుకు వచ్చిన వలస కూలీ జీవితం రాలిపోయింది. కొమ్మలను నరికేస్తుండగా కొమ్మతో పాటు కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణంలోని పోస్టాఫీసు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్‌ జిల్లా జడ్చర్లలోని మూలస్థంభం తాండాకు చెందిన తరణ్‌ నాయక్‌(30) గత మూడేళ్ల క్రితం తాండూరుకు వలస వచ్చాడు. పట్టణంలోని కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న ఎండీ రహమాన్ అనే వ్యక్తికి చెందిన కట్టెల మిషన్‌ లో కూలీగా చేరాడు. గురువారం తాండూరు పట్టణంలోని పోస్టాఫీసు వద్ద ఉన్న ఓ చెట్టు కొమ్మలను నరికేందుకు తరుణ్‌ నాయక్ వచ్చాడు. చెట్టు పైకి ఎక్కి కొమ్మలను నరికే క్రమంలో ప్రమాద వశాత్తు తరుణ్‌ నాయక్ కొమ్మతో పాటు కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యుల తరుణ్‌ నాయక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. కుటుంభీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని పోలీసులు వెల్లడించారు. వలస వచ్చి చెట్టుపైనుంచి కూలీ మృతి చెందడంతో ఈ సంఘటన వారి కుటుంబంలో విషాధం నింపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32705/