schedule Sunday, September 06, 2026

మంచి ఆహారంతోనే ఆరోగ్యం..!

calendar_today January 10, 2025
person dharshininews
మంచి ఆహారంతోనే ఆరోగ్యం..!
మంచి ఆహారంతోనే ఆరోగ్యం..! - ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా రెడ్డి - అభినందించిన ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి - కేరళ మోడల్ స్కూల్లో ఉత్సహాంగా ఫుడ్ ఫెస్టివల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మంచి ఆహారమే మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని తాండూరు ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని కేరళ మోడల్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్లో ఉత్సహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ చేతులతో స్వయంగా చేసుకువచ్చిన వంటకాలు, ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డిలు వేరువేరుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆహార ప్రదర్శనలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి కాలంలో ఆహారం కల్తీ జరుగుతున్న సంఘటనలు చూస్తున్నామన్నారు. వీలైనంత వరకు ఎవ్వరు బయటి ఆహారాలను తినకపోవడమే మంచిది అని అన్నారు. ఇండ్లలో స్వయంగా చేసుకున్న భోజనానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. మంచి ఆహారమే మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందన్నారు. ఆహార ప్రయోజనాలపై విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు బాగున్నాయని వారిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన యజమాన్యాన్ని కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు, స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32185/