schedule Saturday, July 04, 2026

ఎలుకల్ని ఎత్తుకెళ్లడమేంట్రా బాబు..!

calendar_today December 30, 2024
person dharshininews
ఎలుకల్ని ఎత్తుకెళ్లడమేంట్రా బాబు..!
ఎలుకల్ని ఎత్తుకెళ్లడమేంట్రా బాబు..! - 1కాదు, 2 కాదు.. 3,650 ఎలుకల చోరీ - గుర్తించి కేసులు నమోదు చేసిన పోలీసులు - సోషల్ మీడియాలో వింత దొంగతనం వైరల్ దర్శిని డెస్క్ : కొంత మందికి విచిత్రమైన రీతిలో దొంగతనం చేయడం అలవాటు. విభిన్నంగా చోరీలు చేసి చిక్కిపోతుంటారు. అలాంటి ఓ వింత దొంగతనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ వారు చేసిన దొంగమేంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. 1 కాదు,2కాదు 150 ఎలుకలను చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే... హర్యానా రాష్ట్రం జింద్ హర్యానాలోని జింద్ జిల్లా ధత్రత్ గ్రామంలో ఉన్న ఓ యానిమల్ హౌస్ లో 3500 సుంచు ఎలుకలు(సందెలుకలు), 150 ఎలుకలను ఉంచారు. ఈ జంతు సంరక్షణ కేంద్రంలో చిన్న జంతువులపై పరిశోధనతో పాటు సంతానోత్పత్తి పనులు కూడా జరుగుతాయి. అయితే, జమ్మూకి చెందిన సునీల్ అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా యానిమల్ హౌస్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబరు 17న ఎలుకల తక్కువగా ఉండడంతో యానిమల్ హౌస్ యజమాని రాజేష్ కుమార్‌కు అనుమానం వచ్చింది. సీసీ కెమెరాలతో నిఘా ప్రారంభించి డిసెంబర్ 19న దొంగతనం చేస్తున్న దొంగను పట్టుకున్నారు. 12 సంచుల్లో ఉంచిన దాణాను బయటకు తీసుకెళ్తున్నట్లు రాజేష్ చూశాడు. సంజయ్ కుమార్ అనే వ్యక్తి తన కారులో ఎలుకలు, వాటికి కావాల్సిన ఆహారం సంచులను ఎక్కించుకున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయి. పోలీసులు సునీల్ శర్మ, సంజయ్ కుమార్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీలో చిక్కడంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. నిందితుడు సునీల్ శర్మను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడు సంజయ్ కుమార్ పరారీలో ఉన్నట్టుగా తెలిసింది.. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ వింత దొంగతనం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31840/