schedule Friday, September 04, 2026

వామ్మో..వసతి భోజనం..!

calendar_today December 10, 2024
person dharshininews
వామ్మో..వసతి భోజనం..!
వామ్మో..వసతి భోజనం..! - వికటించి ఆస్వస్థతకు గురైన విద్యార్థినిలు - 15 మంది అమ్మాయిలు ఆసుపత్రి పాలు - తాండూరు ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థినిలు ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయిపూర్‌లో ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ (గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల) కొనసాగుతోంది. గత కొన్ని రొ జులుగా హాస్టల్లో భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నంలో పురుగులతో పాటు మొత్తగా వండుతున్నారని, చారు నీళ్లలా ఉంటుందని విద్యార్థినిలు తెలిపారు. తాజాగా సోమవారం రాత్రి కూడా వండిన భోజనం తినలేకపోయామని వాపోయారు. భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో హాస్టల్ టీచర్ మంగళవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన తాండూరులో కలకలం రేపింది. మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/31361/