schedule Thursday, September 10, 2026

జిల్లా కలెక్టర్‌కు సెక్యూరీటీ..!

calendar_today November 16, 2024
person dharshininews
జిల్లా కలెక్టర్‌కు సెక్యూరీటీ..!
జిల్లా కలెక్టర్‌కు సెక్యూరీటీ..! - అదనపు భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వం - లగచర్ల దాడి ఘటనతో నిర్ణయం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు అదనపు సెక్యూరిటీ కల్పించాలరు. జిల్లాలోని దుద్యాల మండలం లగచర్ల దాడి ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ కు ఇద్దరు ఏఆర్ గన్‌ మెన్‌లను పోలీసు శాఖ తరపున కేటాయించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని డీజీ మహేష్‌ భగత్ సందర్శించి కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి దాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు లగచర్లలో అధికారులపై దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. తాజాగా మరో 8 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిని పరిగి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు, మిగతా 16 మందిని పరిగి నుంచి సంగారెడ్డి జైలుకు తరలించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30563/