schedule Saturday, July 04, 2026

కిరాణ, టీ స్టాల్‌లో మంటలు

calendar_today November 13, 2024
person dharshininews
కిరాణ, టీ స్టాల్‌లో మంటలు
కిరాణ, టీ స్టాల్‌లో మంటలు - అగ్ని ప్రమాదంతో సామాగ్రి దగ్దం - తాండూరు కోకట్‌ రోడ్‌లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కిరాణా కొట్టు, టీ స్టాల్‌ నిర్వహిస్తున్న షాపులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలో బుధవారం రాత్రి జరిగింది. నాగేంద్రమ్మ అనే మహిళ కిరాణ కొట్టు, టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తుంది. బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు పూర్తిగా వ్యాపించడంతో దుకాణంలోని ఫ్రిజ్జు, ఇతర సామాగ్రి, సరుకులు పూర్తిగా దగ్దమయ్యాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కిరాణా కొట్టు, టీ స్టాల్‌పై ఆధారపడి జీవిస్తున్న తనకు నష్టం జరగడం పట్ల యజమానురాలు నాగేంద్రమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30551/