schedule Saturday, July 04, 2026

దాడి కేసులో 16 మంది అరెస్టు..!

calendar_today November 12, 2024
person dharshininews
దాడి కేసులో 16 మంది అరెస్టు..!
దాడి కేసులో 16 మంది అరెస్టు..! - ఇంకా దొరకని కీలక వ్యక్తి కోసం గాలింపు - అతను దొరికితేనే డొంక దొరికేది - నిందితుల రిమాండుకు చర్యలు వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల లడాయిలో కీలక వ్యక్తి కోసం పోలీసుల గాలింపు చర్యలు జరుగుతున్నాయి. గ్రామంలో అధికారులపై దాడికి ఘటనలో మొత్తం 57 మందిని అదుపులోకి తీసుకోగా అందులో 16 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. దీని తరువాత కోడంగల్ మెజిస్ట్రేట్‌లో హాజరు పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా వివాదంలో కీలక వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సురేశ్‌ని అరెస్టు చేసిన తర్వాత అతని వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. అతని కాల్ డేటాను విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి బయట వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30524/