schedule Saturday, July 04, 2026

అధికారులపై దాడి గుండాల కుట్ర..!

calendar_today November 12, 2024
person dharshininews
అధికారులపై దాడి గుండాల కుట్ర..!
అధికారులపై దాడి గుండాల కుట్ర..! - దాడి ఘటనలో నిఘా విభాగాలు విఫలం - దాడుల్లో మా పార్టీ వాళ్లు ఉన్న వదలొద్దు - లగచర్ల వివాదంపై చేవేళ్ల ఎంపీ కొండా సంచలన వాఖ్యలు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఫార్మా విలేజ్ కంపెనీ వివాదంలో రాజకీయ నేతల హస్తం, గుండాల కుట్ర దాగి ఉందని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. వికారాబాద్‌ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని లగచర్లలో ఫార్మా కంపెనీ భూ అభిప్రాయ సేకరణ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా, పోలీసు అధికారులపై జరిగిన దాడిపై స్పందించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వినతిపత్రాలు అందించాలని, దర్నాలు చేయాలి తప్పా దాడులకు దిగడం పద్దతి కాదని ఖండించారు. అధికారుల పనితీరుతోనే నాయకులకు, ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుందన్నారు. అలాంటి వారిపై దాడులు చేయడం వెనక రాజకీయ హస్తం, గుండాల కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా, ఆఖరుకు మా పార్టీ నేతలు ఉన్నా కూడా వదిలొద్దని అన్నారు. అదేవిధంగా దాడి ఘటనపై నిఘా విభాగాలు వైఫల్యం చెందాయన్నారు. నిజంగా వివాదం ఉంటే విచారణ జరపాలని అన్నారు. వివాదాన్ని ప్రోత్సహించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు.. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ కమిటి సమావేశానికి హాజరయ్యారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30498/