schedule Friday, September 11, 2026

అది.. దాడి కాదు..!

calendar_today November 11, 2024
person dharshininews
అది.. దాడి కాదు..!
అది.. దాడి కాదు..! - లగచర్ల ఘటనపై కలెక్టర్‌ స్పందన - వివాదంను వివరించిన జిల్లా కలెక్టర్ వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. అది అసలు దాడే కాదని.. కొందరు వ్యక్తుల వల్ల తోపులాట జరిగిందని చెప్పుకోచ్చారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో ఫార్మా విలేజ్ కోసం భూములు ఇచ్చే రైతులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక తహసీల్దారుతో కలిసి కలెక్టర్, తాండూరు సబ్ కలెక్టర్, కడా అధికారి కూడా వచ్చారు. లగచర్ల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అధికారులు గ్రామసభను పెట్టారు. ఊరి బయట చర్చలకు ఏర్పాట్లు చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ గ్రామానికి వెళ్లగా రైతులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనక్కి వెళ్లాలని కారుపై రాళ్లు విసిరారు. దీంతో కారు అద్దాలు పగిలాయి. దీంతొ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటనపై జిల్లా కార్యాలయానికి చేరుకున్నాక కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. కొందరు వ్యక్తులు కావాలనే తోపులాట చేశారని, ఇందులో ఎలాంటి దాడి జరగలేదన్నారు. గ్రామస్తులు మన రైతులే అని.. చెప్పుకొచ్చారు. దాడి అనే పదం వాడోద్దని మీడియాకు సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30492/