schedule Saturday, July 04, 2026

కానిస్టేబుల్‌కు నివాళులు

calendar_today October 6, 2024
person dharshininews
కానిస్టేబుల్‌కు నివాళులు
కానిస్టేబుల్‌కు నివాళులు - పోలీసు లాంచనాలతో అంత్యక్రియలు - పాల్గొన్న డీఎస్పీ, సీఐ, పోలీసులు - పరామర్శించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కు పలువురు నివాళులు అర్పించారు. పోలీసుశాఖ అధికార లాంచనాలతో అంత్యక్రియలు ముగిశాయి. పెద్దేముల్ మండల కేంద్రంలోని పోలీస్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కావలి రవికుమార్ (38) శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఇంట్లో నిద్రలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. శనివారం తాండూరు పట్టణంలోని గొల్ల చెరువులో కావలి రవికుమార్ అంత్యక్రియలు జరిగాయి. పోలీసులు అధికార లాంచనాలతో నివాళులు అర్పించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ గిరి, సిబ్బంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు కావలి రవికుమార్ మృతి చెందిన విషయం తెలుసుకున్న తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి నివాసానికి చేసుకుని కుటుంబాన్ని పరామర్శించారు. కానిస్టేబుల్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29574/