schedule Friday, September 11, 2026

సోషల్‌ మీడీయాను అతిగా నమ్మొద్దు..!

calendar_today August 30, 2024
person dharshininews
సోషల్‌ మీడీయాను అతిగా నమ్మొద్దు..!
సోషల్‌ మీడీయాను అతిగా నమ్మొద్దు..! - బాల్య వివాహాలు, అక్రమ రవాణాను దైర్యంగా ఎదుర్కొవాలి - ఆపదలో ఉంటే షీటీం లేదా పోలీసులను సంప్రదించాలి - విద్యార్థులతో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాలేజీ విద్యార్థులు సోషల్ మీడియా మోజులో పడరాదని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రాం వంటి సోషల్ మీడియాకు అడిక్ట్ కావద్దన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను షేర్‌ చేసుకోవద్దని, ఆకతాయిలనుంచి జాగ్రత్త పడాలన్నారు. అదేవిధంగా అమ్మాయిలను, మహిళలను ఎవరైనా వేధిస్తే షీ టీంను సంప్రదించాలన్నారు. ఇందుకోసం డయల్ 181 లేదా 100కు సమాచారం అందించాలన్నారు. బాల్య వివాహాలు జరిగితే.. బాలికల అక్రమ రవాణా జరిగితే కూడా పోలీసులను సంప్రదించాలన్నారు. ఆపదలో ఉన్న సమయంలో షీటీం, పోలీసులు రక్షణగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో షీటీం ఇంచార్జ్ శేఖర్, కాలేజీ ప్రిన్సిపల్ మల్లికార్జున్, అద్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28632/