schedule Saturday, July 04, 2026

లీడర్ ఇంటికే స్కెచ్..!

calendar_today August 30, 2024
person dharshininews
లీడర్ ఇంటికే స్కెచ్..!
లీడర్ ఇంటికే స్కెచ్..! - బంగారం, వెండి ఆభరణాల అపహరణ - పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ ఇంట్లో చోరీ - రంగంలోకి దిగిన పోలీసులు, ముమ్మర విచారణ తాండూరు, దర్శిని ప్రతినిధి : గుర్తుతెలియని దొంగలు లీడర్ ఇంటికే స్కెచ్ వేశారు. పక్కా ప్లాన్‌ తో ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో ఉడాయించారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది. ఎందుకంటే పెద్దేముల్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఇంట్లోనే ఈ దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి మండల మాజీ వైస్ ఎంపీపీగా పనిచేశారు. అయితే గురువారం రాత్రి ఆయన ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి దాదాపు 18 తులాల బంగారం, సుమారు 26 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్‌ కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. డాగ్ స్వ్కాడ్‌ను తెప్పించి గాలింపు చేపట్టారు. చోరి జరిగిన విధానంపై రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ గిరిలు ఆరా తీశారు. పెద్దేముల్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఇంట్లో చోరీ జరగడం కలకలం రేపింది. అయితే గోపాల్ రెడ్డి కుటుంబంతో కలిసి యాదగిరి గుట్టకు వెళ్లగా గురువారం అర్దరాత్రి దాటిన తరువాత ఈ చోరీ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రూరల్ సీఐ, ఎస్ఐలతో కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28628/