schedule Saturday, July 04, 2026

కాలేజీలో క్షుద్రపూజలు..!

calendar_today August 30, 2024
person dharshininews
కాలేజీలో క్షుద్రపూజలు..!
కాలేజీలో క్షుద్రపూజలు..! - వరుసగా రెండు రోజులుగా నిర్వహణ - బషీరాబాద్‌ మండల కేంద్రంలో కలకలం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుకునే కాలేజీలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నారు. ఈ సంఘటన బషీరాబాద్ మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో పసుపు, కుంకుమ, ఇతర పూజా సామాగ్రిలు కనిపించడం కలకలం రేపింది. గత రెండు రోజులుగా కాలేజీ ఆవరణలో ముగ్గు, పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినట్లు కళాశాల సిబ్బంది, తల్లిదండ్రులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు గత రెండు రోజులుగా ఇలాంటి పూజలు చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో విద్యార్థులు కళాశాలకు వచ్చేందుకు భయాందోళన చెందుతున్నారు. ఓ వైపు సైన్స్ రంగంలో దూసుకపోతుంటే మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని క్షుద్రపూజలు అంటూ భయపెట్టడం చర్చనీయాంశంగా మారింది. మూఢనమ్మకాలతో భయపెట్టే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28617/