schedule Saturday, September 05, 2026

అదృష్టమంటే అక్కదే..!

calendar_today August 25, 2024
person dharshininews
అదృష్టమంటే అక్కదే..!
అదృష్టమంటే అక్కదే..! - రైలు కిందపడినా సేఫ్‌ అయ్యింది - ఆమె ఆలోచనకు అందరి హ్యాట్సాఫ్ - తాండూరులో వైరల్‌ అయిన సంఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలలో ఎందరో ప్రాణాలు కోల్పోతారు. కొందరిలో మాత్రమే అదృష్ట వశాత్తు బతికిపోతారు. అనుకోకుండా జరిగే రైలు ప్రమాదాల్లో బతికి బయటపడం అసాధ్యమే. కాని వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం నావంద్గి రైల్వే స్టేషన్‌ పరిధిలో ఓ గిరిజన మహిళ అదృష్ణ వశాత్తు బతికి పోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బషీరాబాద్‌ మండలం నవాంద్గి రైల్వే స్టేషన్‌ మద్య ఈ సంఘటన జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలో టాకీ తాండాకు చెందిన ఓ మహిళ పట్టాలు తాటే ప్రయత్నం చేస్తుండగా వేగంగా వచ్చిన ఓ గూడ్స్ రైలు అటుగా వచ్చింది. వెంటనే రైలు పట్టాల మద్య పడుకుంది. ఏమాత్రం తలను, శరీరాన్ని పైకిలేపకుండా పట్టాలకు అతుక్కుపోయింది. ఊపిరి భిగబట్టి.. స్థానికుల సూచనలు పాటిస్తూ ధైర్యంగా పడుకుంది. రైలు మీద నుంచి పూర్తిగా వేళ్లేంత వరకు అలాగే పడుకుంది. రైలు వెళ్లిపోయిన తరువాత ప్రాణాలతో సేఫ్‌గా బయటపడింది. ఈ సంఘటనను స్థానికులు వీడియో తీశారు. [video width="478" height="850" mp4="https://www.dharshininews.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-25-at-6.53.32-PM.mp4"][/video] రైలు ప్రమాదంలో ప్రాణాలనుంచి బయటపడిన మహిళను అధృష్ణమంటే అక్కదే అంటూ... ట్రాక్ మద్య పడుకుని ప్రాణాలు కాపాడుకున్న ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అయితే మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28537/