schedule Thursday, September 10, 2026

తాళం వేసిన ఇంట్లో చోరీయత్నం..!

calendar_today August 16, 2024
person dharshininews
తాళం వేసిన ఇంట్లో చోరీయత్నం..!
తాళం వేసిన ఇంట్లో చోరీయత్నం..! - దొంగల వేట కోసం రంగంలోకి క్లూస్ టీం - ఇంట్లో డబ్బు, నగలు అంతా సేఫ్ - అయినా అంతుపట్టని దొంగల స్కీం - తాండూరులో కలకలం రేపిన దొంగతనం తాండూరు, దర్శిని ప్రతినిధి : గుర్తుతెలియని దొంగల ముఠా చేసిన చోరీ యత్నం పోలీసులను, స్థానికులను టెన్షన్ పెట్టింది. ఇంట్లో నగదు, డబ్బు అంతా సేఫ్‌గా ఉన్నా దొంగతనానికి వచ్చిన దొంగలు మరి ఏం ఎత్తుకెళ్లినట్లు అనే అశ్చర్యానికి గురిచేసింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన స్టోన్ వ్యాపారి వికారుద్దీన్ పర్వేజ్ ఈనెల 4వ తేదీన కుటుంబంతో కలిసి హజ్ యాత్రకు వెళ్లారు. అయితే శుక్రవారం సాయంత్రం పై పోర్షన్లో ఉండే కూతురు ఇంటి తలుపులను పరిశీలించగా, తాళం పగలగొట్టి ఉన్నట్లు గుర్తించింది. వ్యాపారి ఇంట్లో చోరీ జరగడంతో వెంటనే పోలీసులు క్లూస్ టీం రంగంలోకి దించారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అన్ని గదులను జల్లెడ పట్టి ...ఇల్లంతా చిందరవందర చేసినట్లు గుర్తించారు. ఒక గదిలో దాచి ఉంచిన రూ. 15 లక్షలతో పాటు సుమారు 20 తులాల బంగారం భద్రంగా ఉన్నట్లు తెలిసింది. ఈ డబ్బు, నగలు దొంగలకు దొరకలేదనీ పోలీసులు, యజమానులు భావిస్తున్నారు. ఇంట్లో ఏమి చోరీ కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఖరీదైన ఇంటిని టార్గెట్ చేసుకున్న దొంగలు ఇంట్లో మరేమైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగల ఆనవాళ్ళ కోసం తనిఖీలు చేస్తున్నారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో కొన్ని గంటల సేపు కలకలం రేపింది. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/28437/