schedule Thursday, September 10, 2026

న్యాయవాదులపై దాడులు సరికాదు

calendar_today August 7, 2024
person dharshininews
న్యాయవాదులపై దాడులు సరికాదు
న్యాయవాదులపై దాడులు సరికాదు - దాడిచేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి - తాండూరు న్యాయవాదుల నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : న్యాయవాదులపై దాడులు చేయడం సరైన పద్దతి కాదని తాండూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయవాదులు మండిపడ్డారు. జనగామలో న్యాయవాద దంపతులపై అక్కడి పోలీసులు దాడి చేయడం పట్ల బుధవారం కోర్టులో విధులు బహిష్కరించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ పోలీసులు న్యాయవాద దంపతులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితుల తరుపున న్యాయవాదులు ఎవరైనా పోలీస్టేషన్ కు వెళ్లాల్సి వస్తుందని, ఫ్రెండ్లీగా వ్యవహరించాల్సిన పోలీసులు సహనం కోల్పోయి దాడులకు పాల్పడడం హేయమన్నారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాంరెడ్డి, రవికుమార్, కె.గోపాల్, శ్రావణ్ కుమార్, సోఫియా భేగం, అరుణ, గుండప్ప. ఫరీద్, జిలాని, కలాం, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28121/