schedule Friday, September 11, 2026

గొడుగు చేసిన ఘోరం..!

calendar_today June 9, 2024
person dharshininews
గొడుగు చేసిన ఘోరం..!
chai jr గొడుగు చేసిన ఘోరం..! - రోడ్డు ప్రమాదంలో పంచాయతీ సెక్రటరి మృతి - గ్రూపు-1 పరీక్ష రాసి వస్తుండగా ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : గొడుగు గాలి ఓ గిరిజన మహిళ పంచాయతీ కార్యదర్శి ప్రాణాన్ని బలి తీసుకుంది. బైకుపై నుంచి కిందపడిన రోడ్డు ప్రమాదంలో ఆమె కన్నుమూసింది. ఆదివారం నిర్వహించిన గ్రూపు-1 పరీక్ష రాసి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బొంరాస్ పేట్ మండలం దేవులానాయక్ తాండా, బొట్లవోని తాండాకు చెందిన సుమిత్రబాయి(29)తో నెహ్రు నాయక్ లు దంపతులు. సుమిత్రాబాయి యాలాల మండలం అచ్చుతాపూర్ గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. అయితే గ్రూపు-1 పరీక్ష రాసేందుకు సిద్దమయ్యింది. ఆదివారం వికారాబాద్‌లోని అనంత పద్మనాభ కాలేజీలో కేటాయించిన కేంద్రానికి తాండూరుకు నుంచి భర్తతో కలిసి బయల్దేరింది. పరీక్ష ముగిసిన తరువాత వారు బైకుపై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో వర్షంతో పాటు గాలి వీయడంతో వెనుకాల ఉన్న సుమిత్రాబాయి తనవద్ద ఉన్న గొడుగును తీసే ప్రయత్నం చేసింది. ధారూర్ మండలం గట్టెపల్లి వద్ద వస్తుండగా గాలి బలంగా వీయడంతో గొడుగుతో పాటు సుమిత్రాబాయి బైకుపై నుంచి కిందపడిపోయింది. ఈక్రమంలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో ఆమెను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బందువులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27095/