schedule Friday, September 11, 2026

నాటు సారా డొంకలాగితే..!

calendar_today June 2, 2024
person dharshininews
నాటు సారా డొంకలాగితే..!
chai jrనాటు సారా డొంకలాగితే..! - 648 కిలోల బెల్లం స్వాదీనం - ఇద్దరు నిందితులపై కేసు నమోదు - వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సీఐ బాల గంగాదర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : నాటుసారపై తనిఖీలు చేయగా నల్లబెల్లం విక్రయాల గుట్టు రట్టయ్యింది. ఈ సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తాండూరు ఎక్సెజ్ సీఐ బాల గంగాదర్ వెల్లడించారు. ఆదివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపిన వివరాలిలాఉన్నాయి. రంగారెడ్డి డిప్యూటీ కమీషనర్, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు శనివారం తాండూరు ఎక్సైజ్ సీఐ బాల గంగాదర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం మదనంతా పూర్ తాండాలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో నేనావత్ శంకర్ అనే వ్యక్తి వద్ద 2 లీటర్ల నాటు సారా స్వాదీనం చేసుకున్నారు. తయారికి సరుకు ఎలా వస్తుందని విచారించగా తాండూరులోని జై భవాని ఎంటర్ ప్రైజెస్ షాపు యజమాని గురు రమేష్ వద్ద తీసుకవస్తున్నట్లు గుర్తించారు. దీంతో తాండూరులోని గురు రమేష్ షాపులో తనిఖీలు నిర్వహించారు. అక్కడ 648 కిలోల బెల్లం స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ బాల గంగాదర్ తెలిపారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ సబ్ ఇనుస్పెక్టర్లు మహమ్మద్ నిజాముద్దీన్, రవికుమార్. సిబ్బంది రాజేందర్, భీమయ్య, మహమ్మద్ సుల్తాన్, మహేష్ లు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26909/