schedule Saturday, September 05, 2026

వేసవిలో గొంతు నొప్పి వేధిస్తుందా..!

calendar_today April 16, 2024
person dharshininews
వేసవిలో గొంతు నొప్పి వేధిస్తుందా..!
వేసవిలో గొంతు నొప్పి వేధిస్తుందా..! - ఈ చిట్కాలు పాటిస్తే బాధ పరార్ - ఇంట్లో ఉండి ఉపశమనం పొందొచ్చు దర్శిని ప్రతినిధి : మారుతున్న వాతావరణం వల్ల ప్రతిసారి మనకు ఏదో అనారోగ్య సమస్య వేధిస్తుంది. ఈ వేసవిలో చిన్నారుల నుంచి పెద్దల వరకు గొంతునొప్పి వేధిస్తుంది. వేసవి కాలంలో గొంతులో టాన్సిల్స్ వంటి సమస్యలు వస్తాయని, దీని వల్ల నీరు తాగడానికి, మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మంచి చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. గొంతు ఇన్ఫెక్షన్ సమస్యకు ఇంట్లోనే చికిత్స తీసుకొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. చల్లని పానీయాలు తీసుకోవడం మానుకోవాలి వేసవి కాలంలో ఐస్ క్రీం, శీతల పానీయాలు తాగడం చాలా సరదాగా ఉంటుంది. కానీ అవి గొంతు నొప్పికి దారి తీస్తుంటాయి. శీతల పానీయాలు కూడా శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. కాబట్టి పిల్లలు చల్లటి పదార్థాలు తినకుండా నివారించాలి. స్నానం చేయడం హానికరం మనలో చాలా మంది బయట ఎండలో తిరిగి వచ్చిన తర్వాత, నేరుగా స్నానం చేయడానికి లేదా ముఖం కడగడం వంటివి చేస్తుంటారు. ఇది కూడా జలుబు, గొంతు నొప్పికి కారణం అవుతుంది. అందువల్ల, కొద్దిసేపు కూర్చున్న తర్వాత మాత్రమే నీళ్లను ముట్టుకోవడం మంచిది. వెంటనే ఏసీలో కూర్చోకూడదు ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఏసీ, కూలర్‌ వేసుకుని కూర్చోవద్దు. ఇది వేడి, చలికి కారణమవుతుంది. దీని ప్రభావం గొంతుపై పడవచ్చు. మీరు ఏసీలో కూర్చోవాలనుకుంటే.. దాని ఉష్ణోగ్రత 25 డిగ్రీల లోపు ఉండేలా చూసుకోవాలి. కషాయం కూడా ప్రయోజనకరమే ఒక లీటరు నీటిలో 1 టీస్పూన్ తులసి, ఎండుమిర్చి, ఎండు అల్లం, దాల్చిన చెక్కలను వేసి సన్నని మంటలపై బాగా వేడి చేయాలి. ఇందులోని ఔషధ గుణాలన్నీ నీళ్లలోకి వచ్చి కషాయం తయారు అవుతుంది. కషాయం తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఆవిరి పట్టుకోవాలి గొంతు నొప్పి, శ్లేష్మం వంటి సమస్యల నుంచి ఉపశమనానికి ఆవిరి పట్టుకోవాలి. ఆవిరి మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్టీమర్‌తో ఆవిరి పట్టేటప్పుడు దుప్పటి లేదా టవల్‌తో ముఖాన్ని కప్పుకోవాలి. కనీసం 5 నుంచి 7 నిమిషాల వరకు ఆవిరి పట్టాలి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25580/