schedule Thursday, September 10, 2026

మహిళ దారుణ హత్య

calendar_today April 6, 2024
person dharshininews
మహిళ దారుణ హత్య
మహిళ దారుణ హత్య - డెడ్‌ బాడీపై గడ్డి కప్పిన దుండుగులు - తాండూరు పట్టణంలో ఘటన - దర్యాప్తు జరుపుతున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె డెడ్‌ బాడీపై గడ్డి కప్పారు. తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్ సమీప దూరంలో వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపింది. మృతురాలి అక్క తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోస్గి నియోజకవర్గం గుండిమల్‌ గ్రామానికి చెందిన పి.తిరుపతమ్మ(37) భర్తలేక పోవడంతో తల్లిగారి వద్ద ఉంటోంది. ఈమెకు ప్రభుత్వం అసరా ఒంటరి మహిళ ఫించన్‌ కూడా అందుతోంది. అయితే తాండూరు పట్టణం సాయిపూర్‌లో ఉంటున్న అక్కవద్దకు గత రెండు నెలల క్రితం వచ్చింది. అక్క వద్ద ఉంటూ ఓ ఇంట్లో పనిమనిషిగా చేరింది. రోజూ పనికి వెళ్లి వచ్చే తిరుపతమ్మ శుక్రవారం రాత్రయినా రాలేదు. అక్క పనివద్ద, తెలిసిన వారి వద్ద విచారించిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో శనివారం తాండూరు పోలీస్టేషన్ సమీపంలోని రాయల్ కాంటా వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో మహిళ డెడ్‌ బాడీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో డెడ్ బాడీపై గడ్డీ కప్పి ఉండడంతో తొలగించారు. ఆమె వద్ద లభించిన ఆధారాలతో అక్క ద్వారా తిరుపతమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. మహిళ హత్యపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25189/