schedule Thursday, September 10, 2026

గడ్డివాము దగ్ధం

calendar_today April 4, 2024
person dharshininews
గడ్డివాము దగ్ధం
గడ్డివాము దగ్ధం - మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది - కరణ్ కోట్ గ్రామంలో ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రమాద వశాత్తు గడ్డి వాముకు మంటలు అంటుకుని దగ్ధమయ్యింది. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సుదర్శన్ గౌడ్ తన దొడ్డిలో పశువుల కోసం గడ్డి వాములను నిల్వ చేసుకున్నాడు. గురువారం ప్రమాద వశాత్తు గడ్డి వాములకు మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకుని తాండూరు ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే గడ్డి వాము పూర్తిగ దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంతో తనకు రూ.50వేల ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు సుదర్శన్ గౌడ్ తెలిపారు. గిట్టని వ్యక్తులు మంటలు అంటించారని అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు పక్కన ఉన్న గౌరీ శంకర్ అనే వ్యక్తికి చెందిన గోశాలకు కూడా ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24762/