schedule Sunday, July 05, 2026

అర్దరాత్రి ఇసుక రవాణా..!

calendar_today April 3, 2024
person dharshininews
అర్దరాత్రి ఇసుక రవాణా..!
అర్దరాత్రి ఇసుక రవాణా..! - రెండు ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు - వెల్లడించిన కరణ్‌కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అర్ధరాత్రి దాటిన తరువాత అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను కరణ్ కోట్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం వీరెశెట్టిపల్లి గ్రామ శివారులోని వాగులో నుంచి మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత 2గంటల ప్రాంతంలో ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న గోనూరుకు చెందిన ట్రాక్టర్(టీఎస్ 34 టీబీ 7502), మరో ట్రాక్టర్(టీఎస్07 ఈపీ 5337)లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. అట్టి ట్రాక్టర్ డ్రైవర్లు సత్రశాల తుకారాం, పటాకీ రాజులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24650/