schedule Sunday, July 05, 2026

స్కూటీలో క్యాష్..!

calendar_today March 24, 2024
person dharshininews
స్కూటీలో క్యాష్..!
స్కూటీలో క్యాష్..! - పట్టుకున్న పోలీసులు - ట్రెజరీ ఆఫీసుకు అప్పగింత - వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : స్కూటిలో అనుమతులు లేకుండా తరలిస్తున్న నగదును తాండూరు మండలం కరణ్ కోట్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు సీసీఐ కాలనీలో నివాసం ఉండే మహమ్మద్ ఆనాజ్ అనే వ్యక్తి తాండూరు నుంచి గౌతాపూర్ వైపు స్కూటిపై వస్తున్నాడు. గౌతాపూర్ వద్ద తనిఖీలు నిర్వహించగా అతని వద్ద అనుమతులు లేకుండా రూ.2.93 లక్షల 830లను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదును తరలిస్తుండడంతో వాటిని సీజ్ చేసినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. సీజ్ చేసిన నగదును జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీకి తరలించినట్లు వెల్లడించారు. ఈసందర్భంగా ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా రూ.50వేలకు మించి నగదును తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.   ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24523/