schedule Sunday, July 05, 2026

ఇద్దరు మట్కా రాయళ్లపై కేసు

calendar_today March 7, 2024
person dharshininews
ఇద్దరు మట్కా రాయళ్లపై కేసు
ఇద్దరు మట్కా రాయళ్లపై కేసు - వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇద్దరు మట్కా రాయళ్లపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ కేసు వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన వకోడే నగేష్‌, ఎన్టీఆర్ కాలనీకి చెందిన షేక్ సిరాజ్‌ లు మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1120ల నగదు, రెండు సెల్ ఫోన్‌లు, మట్కా చిట్టీలను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా మట్కా ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/24311/