schedule Sunday, July 05, 2026

జేబు దొంగలకు జైలు..!

calendar_today March 1, 2024
person dharshininews
జేబు దొంగలకు జైలు..!
జేబు దొంగలకు జైలు..! - ఆర్టీసీ ప్రయాణికుడి నుంచి కొట్టేసిన సొమ్ములో కొంత రికవరీ - వివరాలు వెల్లడించిన తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి - కేసు చేధనలో సిబ్బందికి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆర్టీసీ ప్రయాణికుడుని లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడిన ఇద్దరు జేబు దొంగలను తాండూరు పోలీసులు రిమాండుకు తరలించారు. శుక్రవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో స్థానిక డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి పట్టణ సీఐ సంతోష్ కుమార్ తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.   గతనెల 16న కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి కి చెందిన నారా నాగప్ప తాండూరు ఆర్టీసీ బస్టాండ్ లో హైరాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా అతని జేబులో ఉన్న రూ. 49వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో నాగప్ప అదేరోజు తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ లో నిఘా ఉంచారు. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.   ఈ విచారణలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వానార్చే చంద్రయ్య, వానర్చే బద్రయ్యలుగా గుర్తించారు. గత నెల 16న ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన దొంగతనం తామే చేసినట్లు నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన రూ. 49 వేల నగదులో రూ. 18వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిదుతులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి తెలిపారు. అదేవిధంగా కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన సిబ్బంది అంజద్, శివ, షబ్బీల్, సాయప్పలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ కాశీనాథ్, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.   ఇది కూడా చదవండి... https://dharshininews.com/24244/