schedule Sunday, July 05, 2026

దోచేస్తాడు.. దాచేస్తాడు..!

calendar_today February 29, 2024
person dharshininews
దోచేస్తాడు.. దాచేస్తాడు..!
దోచేస్తాడు.. దాచేస్తాడు..! - ఘరానా బైకు దొంగ రూటే వేరు - పోలీసులకు అడ్డంగా దొరికి జైలుపాలు - వివరాలను వెల్లడించిన తాండూరు డీఎస్పీ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దురాశతో బైకు చోరీలకు పాల్పడిన దొంగ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇంకేముంది పోలీసులు నిందితుడు చోరీ చేసి.. దాచిన బైకులను స్వాదీనం చేసుకుని రిమాండుకు తరలించారు. తాండూరు మండలంలో ఈ ఘరానా దొంగ స్టోరీ వెలుగులోకి వచ్చింది. గురువారం తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడీయా సమావేశం ద్వారా తాండూరు డీఎస్సీ బాలకృష్ణ రెడ్డి తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ విఠల్ రెడ్డిలతో కలిసి వివరాలను వెల్లడించారు. దొంగగా మారిన బైక్ మెకానిక్... కర్ణాటక రాష్ట్రం కలబురికి జిల్లా సేడం తాలూకా కురుగుంట గ్రామానికి చెందిన నిఖిల్ (21) బైక్ మెకానిక్గా పనిచేసేవాడు. ఆ పని వదిలేసి గత కొన్నాళ్ల నుంచి తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ట్రాక్టర్ డ్రైవరుగా పనికి కుదిరాడు. అయితే పని చేసినా డబ్బులు సరిపోకపోవడంతో జల్సాల కోసం ఎలాగైనా డబ్బులు సంపాదించాలని బైకులను చోరీ చేయడం ప్రారంభించాడు. ఇలా నాలుగు నెలల నుంచి తాండూరు పట్టణం, కరణ్ కోట్, వికారాబాద్, హైదరాబాద్, పూడూరు తదితర ప్రాంతాల్లో 12 బైకులను చోరీ చేశాడు. చోరీ చేసిన బైకులను తాను పనిచేస్తున్న వ్యక్తి పొలంలోని షెడ్లో దాచి తక్కువ ధరకు విక్రయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అడ్డంగా దొరికి... ఈక్రమంలో నిఖిల్ చోరీ చేసిన బైకుతో వస్తుండగా గురువారం ఉదయం కరణ్ కోట్ సోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులను చూసి నిఖిల్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల పత్రాలను చూపించాలని కోరారు. ఇందుకు పత్రాలు లేకపోవడంతో నిందితున్ని కరణ్ కోట్ పోలీస్టేషన్‌కు తరలించారు. అక్కడ విచారిచంగా నిందితుడు మొత్తం చోరీలను వెల్లడించి నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు దాచిన 12 బైకులను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుపై కేసు సమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా కేసులో కీలకంగా పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ దస్తప్ప, కానిస్టేబుళ్లు ప్రతాప్ సింగ్, అశోక్, శ్రీవాస్తవంలకు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి చేతుల మీదుగా రివార్డు అందజేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/24235/