schedule Sunday, July 05, 2026

ఆర్టీసీ బస్టాండులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

calendar_today February 29, 2024
person dharshininews
ఆర్టీసీ బస్టాండులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్టాండులో గుర్తుతెలియని వ్యక్తి మృతి - అనారోగ్యంతో మరణించినట్లు అనుమానాలు - మృతదేహాన్ని మార్చురికి తరలించిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ బస్టాండులో ఓ గుర్తుతెలియని మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు -60 ఏండ్లు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మహబూబ్ నగర్ నుంచి తాండూరుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు టిక్కెట్ లభించింది. మిగతా వివరాలు లభించలేదు. అయితే అనారోగ్యంతో మరణించినట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతదేహాన్ని తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. మృతుని వివరాలు తెలిస్తే పోలీసులకు సమచారం అందించాలని సీఐ సంతోష్ కుమార్ సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/24232/