హుండీకి కన్నం వేసిన దొంగ..!
February 12, 2024
dharshininews
హుండీకి కన్నం వేసిన దొంగ..!
- వీరభద్రేశ్వర దేవాలయంలో చోరీ
- తాండూరు మండలం వీరారెడ్డిపల్లిలో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దేవాలయంలో భక్తులు కానుకలు సమర్పించే హుండీకి ఓ గుర్తుతెలియని దొంగ కన్నం వేశాడు. తాండూరు మండలం వీరారెడ్డిపల్లిలోని వీరభద్రేశ్వర దేవాలయంలో చోరీ జరిగి సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని వీరభద్రేశ్వర దేవాలయంలో మడపతి మల్లేశం పూజారిగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి చోరికి తెగబడ్డారు. సోమవారం ఉదయం ఆలయ పూజారి, గ్రామస్తులు గమనించారు.
వెంటనే కరణ్ కోట్ పోలీసులకు సమాచారం అందించారు. దేవాలయంలో ఉన్న హుండీలో సుమారు రూ.70 వేల నగదును అపహరించినట్లు అనుమానాలు వ్యక్తం చేవారు. ఆలయ పూజారి ఫిర్యాదు. మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. మరోవైపు దేవాలయంలో దొంగతనం చేసి వ్యక్తి దొరికిపోయినట్లు గ్రామంలో ప్రచారం జరిగింది. పరిసర గ్రామానికి చెందిన వ్యక్తే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు, హుండిలో కేవలం కొంత నగదును మాత్రమే దొంగతనం చేసినట్లు సమాచారం.
ఇదికూడా చదవండి...
https://dharshininews.com/23811/